డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా మాదక ద్రవ్యాలు, గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన గంజాయిని పల్నాడు జిల్లాలోని జిందాల్ అర్బన్ వేస్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ ప్లాంటులో శనివారం దహనం చేశారు. ఈ కార్యక్రమంలో డీజీపీతో పాటు ఈగిల్ ఐజీ ఆకె రవికృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, గంజాయి రవాణా, విక్రయాలపై ఈగిల్ సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టిందని, పోలీస్, ఎక్సైజ్ శాఖలతో కలసి అంతర్రాష్ట్ర ముఠాలను అణచివేస్తున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష
గతంలో రాష్ట్రంలో గంజాయి సాగు, రవాణా, విక్రయాలు ఎక్కువగా జరిగేవని, ప్రస్తుతం ప్రత్యేక చర్యలతో గంజాయి సాగు తగ్గిందని డీజీపీ తెలిపారు. అయితే, ఒడిసా నుంచి పెద్ద ఎత్తున గంజాయి రవాణా జరుగుతుందని, ఇతర రాష్ట్రాలకు కూడా మన రాష్ట్రం ద్వారానే గంజాయి చేరుతున్నట్లు వివరించారు. ఇతర రాష్ట్రాల పోలీసు విభాగాలతో సమన్వయంతో పనిచేస్తూ గ్యాంగ్‌లను పట్టుకుంటున్నామని చెప్పారు.
ఇప్పటివరకు లక్ష కేజీలకు పైగా గంజాయిని సీజ్ చేసి, అందులో 70 వేల కేజీలను దహనం చేశామని డీజీపీ తెలిపారు. 183 కేసులకు సంబంధించిన రూ.1.87 కోట్ల విలువ గల 3,737 కేజీల గంజాయి, 4.22 కేజీల లిక్విఫైడ్ గంజాయిని జిందాల్ పవర్ ప్లాంటులో దహనం చేసినట్లు వివరించారు. గంజాయి రవాణా, విక్రయాలపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హరీష్‌కుమార్ గుప్తా స్పష్టంచేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!
ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!
ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!
ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!
ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!
పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!
గుంటూరులో జగన్ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: